Te:NeMo-Linux
నెమో వ్యాస అధోభాగము
లినక్సు అంటే ఏమిటి??
మరల వ్యాస అధోభాగమునకు | ముఖ్య పేజి
ద్వారక నాథ్ (Dwaraka Nath)
మేరాజ్ ఇమ్రాన్ (Meraj Imran)
హేమ భాను ప్రియ (Hema Bhanu Priya)
లినక్సు అంటే ఏమిటి??
హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లినక్సు!! నేను ఒక ఆపరేటింగ్ సిస్టంని. కొత్తగా వినిపిస్తున్నాన ?? సరే, ముందుగ ఆపరేటింగ్ సిస్టం అంటె ఏంటో తెలుసుకుందాం. సహజంగ కంప్యూటర్ అనేది మెమరీ డిస్కస్, సి డి రీడర్స్, సౌండ్ కార్డ్స్, ప్రాసెసర్ మరియు ఎన్నో చిన్న చిన్న భాగాల సమూహము. ప్రోగ్రామింగ్ నియమాలతో అదే నండి సాఫ్ట్వేర్ తో ఏ కంప్యూటర్ అయితే నడవగాలదో దానినే ఆపరేటింగ్ సిస్టం అంటారు.
నేను కూడా ఇలంటి ఒక ఆపరేటింగ్ సిస్టం నే. మన ఇళ్ళలో వాడే కంపూటర్లు , పని చేసే చోట్ల వాడే కంపూటర్లు అత్యధిక శాతం విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఫై నడుస్తున్నవే. కొన్ని కంప్యూటర్ లలో ఆపిల్స్ మాక్ ఓ ఎస్ కూడ వాడుకలో ఉందండోయ్. వీటన్నిటి మీద చాల సులభంగా పని చేయవచ్చు. కాని, ఈ ఆపరేటింగ్ సిస్టంలతో జరగని పనులు నా వల్ల సాధ్యం. ఉఫ్ఫ్.. నాక్కొంచం తిక్కుంది కాని దానికో లెక్కుంది. ఆ లెక్కేంటో తెలుసుకుందాం రండి.
కంపూటర్ల యొక్క వాడుక పెరుగుతున్న కొద్ది దాని నుండి మనం ఆశించే ఫలితాలు కూడా పెరుగుతునే ఉన్నాయి. ప్రతి సారి హార్డువేర్ మార్పునకు సరళికృతం చేయడము కష్టతరముగా మారింది. అటువంటి కష్టకాలం లో సులభముగా మార్పిడి చేయగలిగే ఓ ఆపరేటింగ్ సిస్టం 1969 లో వెలుగులోకి వచ్చింది. అదే యునిక్ష్ (UNIX). బెల్ లాబొరేటరీస్ యొక్క ఏ టి అండ్ టీస్ సంస్ద దీనికి ప్రోత్సాహాన్ని అందించింది. ఏ టి అండ్ టీస్ సంస్ద 1982 లో యునిక్ష్ (UNIX) కు లైసెన్స్ పొందింది. మొట్ట మొదటి సారిగా వెచ్చించి వినియోగించే (Commercial Version) యునిక్ష్ (UNIX) ఆపరేటింగ్ సిస్టం ను విశ్వ విద్యాలయాలు,బ్యాంకులు మరియు పరిశోధన సంస్ధలకు అందించింది. వెచ్చించి వినియోగించుకునే విధానము సామాన్యుల యొక్క కలతకు కారణం అయింది. ఆ సమయమున M I T లోని ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ లాబరేటరీ నందు ప్రముఖుడు రిచర్డ్ స్టాల్మన్ జి.ఎన్.యు ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టాడు. యునిక్ష్ (UNIX) తో సరితూగగల మరియు ఉచితమైన ఆపరేటింగ్ సిస్టం ను అందించడమే ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ ఉద్దెశానుసారంగ "ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ " (Free Software Foundation) యొక్క వ్యవస్థాపకుడిగా స్టాల్మన్ వ్యవహరించాడు. ఈ ప్రాజెక్టు కు అనుకున్నంత స్పందన లభించక పోవడంతో అర్ధాంతరంగా ముగించవలసి వచ్చింది. కొన్ని సంవత్సరాల తరువాత మన స్టాల్మన్ గారి లాగ ఉచితంగా వినియోగించు కోగల ఆపరేటింగ్ సిస్టం కనుగొనుటకు 1991 లో ఫిన్నిష్ విద్యార్ధి అగు లినుస్ టోర్వాల్డ్స్( Linus Torvalds) ఆసక్తి కనబరిచాడు. అందుకు తగిన కోడ్ ను ఈయన రాయడం జర్గింది. ఈ ఆశయం యొక్క వార్త వ్యాపించగానే ఇదే లక్ష్యసాధన గల ఎంతో మంది ప్రముఖులు తమ యొక్క అమూల్యమైన సూచనలకు ఈ ప్రాజెక్టు కు అందించారు. అలా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడంతో మొట్ట మొదటి ఉచిత ఆపరేటింగ్ సిస్టమగు లినుక్షును కనుగొన గలిగారు. హలో బాస్ ... ఆ లినక్సును నేనే. నా పేరు లినక్సు అని ఎందుకు పెట్టారో ఆలోచిస్తే అర్దమైదేంటంటే .. నన్ను కనిపెట్టిన లైనస్ (Linus) మరియు నాలో యునిక్ష్ (UNIX) యొక్క మిళితమే నా నామకరణం (LIN - UX). చాల కథలే చెప్పినట్టునానే..ఇంతకీ నేనే ఎందుకు?? నా అవసరమేంటి?? విండోస్, అప్పిల్స్ మాక్ ఓ ఎస్ వంటి గొప్ప ఆపరేటింగ్ సిస్టంలు ఉన్నాక కూడా నాతొ పనేంటి?? ఉందండి… సరే , ఇప్పుడు న పనేంటో,నేను ఎందుకు పనికోస్తనో,నాలోని ప్రత్యేకతలేంటో చెప్పాలి మీకు.
నా మొదటి ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి వైరస్ల్యన నాముందు పటాపంచలే. ఎటువంటి వైరస్ల్యన నన్ను కానీ నా పనితనాన్ని కానీ ఏమి చేయలేవు. ఒక్క మాటలో చెప్పాలంటే నాలో ఎలాంటి వైరస్ ఎక్కదు. నా రెండవ ప్రత్యేకత ఏంటంటే నేను పూర్తిగ ఉచితం మరియు నాలో ఎటువంటి మార్పులకైన నేను ఎల్లప్పుడు సంసిద్ధమే. విండోస్ మాక్ ఓ ఎస్ లల్లో తలెత్తే లోపాలను సరిచేసుకొనుటకు ఎన్నో రోజులు వీటి అనుబంధ సంస్ధల యొక్క స్పందనకు వేచి చూడాల్సి వస్తుంది. నా వలన ఎటువంటి సమస్యలేం ఉత్పన్నం కావు. ఎందుకంటే నా కోసం కృషి చేసే ఎన్నో సంఘాలు ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి. ఎటువంటి సమస్య తలెత్తిన మీకు వెనువెంటనే స్పందన ఉంటుంది.
కాని నా ఫై ఒక దుష్ప్రచారం ఉంది. అదేంటంటే నన్ను ఉపయోగించడం చాలా కఠినం అనే భావన ప్రజల్లో ఇమిడి ఉంది. ఇప్పుడు నన్ను ఉపయోగించడం చాల కఠినం అనే భావన మెల్లిగా తోలిగిపోతోంది. ఇది నాకు ఏంతో సంతోషకరమైన వార్త. ఉబుంటు , ఫెడోర లాగే నా వినియోగం కూడా ఎంతో సులభం.
నా గురించి నా ప్రత్యేకతలు తెలిసిన తరువాత నా ఉపయోగం మరియు నా యొక్క రూపకల్పన నిజంగా ఓ ద్రుష్యకావ్యమే అనిపిస్తుంది. ఇదండీ నా లెక్క, నా తిక్క . మరి ఇంకేంటి ఆలస్యం?? మీ కంప్యూటర్లలోకి నన్ను స్వాగతించండి... సరే ఫ్రెండ్స్, ఉంటాను మరీ ...బాయ్!!